ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లు దాటిపోయింది. అయినప్పటికీ చెక్కుచెదరని అందంతో కుర్రకారుల మతులు పోగొడుతోంది హీరోయిన్ శ్రియ. దక్షిణాదిలో వరుస సినిమాలు చేస్తున్న ఈ హీరోయిన్ టాలీవుడ్‌లో కాస్త వెనకబడింది. అయితే శ్రియకు ఓ బంపరాఫర్ తగిలినట్లు సమాచారం. తెలుగులో భారీ బడ్జెట్‌తో, పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలో నటించే చాన్స్ కొట్టేసిందంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్‌కు జోడీగా చిత్రబృందం శ్రియను ఎంచుకున్నారు. దీంతో ఆమె షూటింగ్ కోసం గతవారం వికారాబాద్ అడవులకు పయనమైంది. అక్కడ అజయ్, శ్రియ జోడీపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారని ఆ వార్తల సారాంశం.
ఆర్‌ఆర్‌ఆర్: కొత్త జోడీ కుదిరింది!