N95 ప్రమాణాలతో స్వదేశీ ఫేస్‌ మాస్క్‌ 'క‌వాచ్‌'

భారతదేశంలో కోవిడ్ -19 నుంచి రక్షణకోసం ఉపయోగించే N95 మాస్క్‌ ధర ఎక్కువగా ఉంది. దీన్ని కొనేందుకు ప్ర‌జ‌లు వెనుకాడుతున్నారు.  N95 మాస్క్‌ను ఎక్కువ రోజులు వాడుకోవ‌చ్చు. ఇది 98 శాతం స్వ‌చ్ఛ‌మైన‌ది. ఇలాంటి ప్రమాణాలు కలిగిన మాస్క్‌ను ఐఐటి- ఢిల్లీ స్టార్టప్  'కవాచ్' అనే పేరుతో స్వదేశీ ఫేస్‌మాస్క్‌ను అభివృద్ధి చేసింది.  త‌క్కువ ధ‌ర‌లో దొరుకుతుంది. త‌ద్వారా ఇది మెరుగైన ర‌క్ష‌ణ  క‌ల్పిస్తుంద‌ని ఐఐటి ఢిల్లీ తెలిపింది. ఈ మాస్క్ ధ‌ర రూ. 45 మాత్ర‌మే. దీనిని క‌నీసం 10 సార్లు ఉతికి పున‌ర్వినియోగించ‌వ‌చ్చు. ఇది ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఉన్న ప్ర‌దేశాల‌లో స‌మ‌ర్థ‌వంతంగా ర‌క్షించ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.